Adipurush: ఆదిపురుష్ విషయంలో దిల్ రాజు ‘లెక్క’ తప్పలేదా..! అందుకే ముందే వద్దన్నాడా.?ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాగా.. విడుదలైన మొదటి ఆట నుంచి..ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాగా.. విడుదలైన మొదటి ఆట నుంచి పలు వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచింది. ఒకవైపు కలెక్షన్లు భారీగా వస్తున్నా.. మరోవైపు ‘ఆదిపురుష్’ చుట్టూ కాంట్రావర్సీలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్ కొన్ని డైలాగులను తొలగిస్తానని పేర్కొన్న విషయం విదితమే.ఇదిలా ఉంటే.. మొదటిగా ‘ఆదిపురుష్’ తెలుగు రాష్ట్రాల హక్కులను యూవీ క్రియేషన్స్ దక్కించుకోవాలని చూసింది. కానీ అనూహ్యంగా రేసు నుంచి తప్పించుకుంది. ఆ వెంటనే ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ ఫ్యాక్టరీ రూ. 185 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అనంతరం ఈ మూవీ తెలుగు రైట్స్‌ను నిర్మాత దిల్ రాజుకు అమ్మాలని చూసినా.. ఆయన మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. చివరికి నైజం రైట్స్ తీసుకునేందుకు కూడా దిల్ రాజు ముందుకు రాలేదని.. సున్నితంగా తిరస్కరించాడట.అప్పటికే శాకుంతలం సినిమాతో సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టాలు చవిచూసిన దిల్ రాజు.. మళ్లీ రిస్క్ చేయకూడదనే ఉద్దేశంతో ‘ఆదిపురుష్’ రైట్స్‌ను తిరస్కరించాడని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటిగా రిలీజ్ అయిన టీజర్ ద్వారా వచ్చిన రెస్పాన్స్ చూసే.. దిల్ రాజు ‘ఆదిపురుష్’ రేసు నుంచి తప్పుకున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం దుమ్మురేపే కలెక్షన్లు రాబడుతున్న ఆదిపురుష్.. లాంగ్ రన్లో ఎంత సాధిస్తుందో వేచి చూడాలి.