Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం వరాల జల్లు.. డిమాండ్ల పరిష్కారానికి పచ్చజెండాఆంధ్రప్రదేశ్పై కేంద్రం వరాల జల్లు కురిపించింది. ఎన్నికల ఏడాదిలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం స్పెషల్ బెయిలవుట్ ప్యాకేజిని ప్రకటించింది. తొమ్మిదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల పరిష్కారానికి పచ్చజెండా ఊపింది. మొత్తంగా రూ. 28,704.02 కోట్ల మేర ఎన్నికల ఏడాది ప్రత్యేక ప్రయోజనాలు అందనున్నాయి. పీఎంఓ ఏర్పాటు చేసిన…ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం వరాల జల్లు కురిపించింది. ఎన్నికల ఏడాదిలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం స్పెషల్ బెయిలవుట్ ప్యాకేజిని ప్రకటించింది. తొమ్మిదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల పరిష్కారానికి పచ్చజెండా ఊపింది. మొత్తంగా రూ. 28,704.02 కోట్ల మేర ఎన్నికల ఏడాది ప్రత్యేక ప్రయోజనాలు అందనున్నాయి. పీఎంఓ ఏర్పాటు చేసిన కమిటీ మూడు అంశాలను పరిశీలించింది. రెవెన్యూ లోటు, రుణ పరిమితి, పోలవరం ప్రాజెక్టుకు నిధులనే మూడు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల విభజన నాటి రెవెన్యూ లోటును భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రెవెన్యూ లోటు కింద రూ. 16,078 కోట్లు రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం లెక్కకట్టింది.వీటిలో విభజన చట్టంలోని సెక్షన్ 46(2) ప్రకారం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ. 5,617.89 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ. 10,460.87 కోట్లు ఈ మధ్యనే విడుదల చేసిన కేంద్రం. 2016-17 నుంచి 2020-21 మధ్యకాలంలో రూ. 17,923.94 కోట్లు పరిమితికి మించి రుణాలు చేసినట్టు కేంద్ర గుర్తించింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ అదనపు మొత్తాన్ని తగ్గించింది.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థన మేరకు ఈ మొత్తాన్ని ఒకే ఏడాదిలో కాకుండా మూడేళ్లకు కేంద్రం సర్దుబాటు చేసింది. 2021-22కి గాను రూ. 3,923.94 కోట్లు, 2022-23కిగాను రూ. 6000 కోట్లు, 2023-24కిగాను రూ. 8000 కోట్లు సర్దుబాటు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రుణ పరిమితిలో కోత పడాల్సిన రూ. 8,000 కోట్లను 3 విడతల్లో చెల్లించే వెసులుబాటు కోరిన ఏపీ ప్రభుత్వం. సాధారణ పరిస్థితుల్లో ఇంత వెసులుబాటు ఇవ్వడం కుదరదని, కానీ ప్రత్యేక కేసుగా పరిణగిస్తూ రూ. 8,000 కోట్లను 2023-24 నుంచి 2025-26 వరకు మరో మూడేళ్ల పాటు సర్దుబాటు చేసిన కేంద్రం. తద్వారా రూ. 8,000 కోట్లను 3 భాగాలుగా చేయగా ఈ ఏడాది రూ. 2,666.67 కోట్లు మాత్రమే రుణ పరిమితి నుంచి కోత విధించాలని నిర్ణయం. కేంద్రం ఇచ్చిన వెసులుబాటుతో ఈ ఎన్నికల ఏడాది అదనంగా రూ. 5,332 కోట్ల మేర రుణం తీసుకునే అవకాశం లభించింది.పోలవరం కోసం..
పోలవరం ప్రాజెక్టు కోసం 2017 మార్చి 15 నాటి కేబినెట్ నిర్ణయం ప్రకారం 2014 తర్వాత నుంచి ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో ఇర్రిగేషన్ కాంపోనెంట్ పూర్తిగా కేంద్రం భరించాల్సి ఉంటుంది. 2013-14 నాటి ధరల ప్రకారం ప్రాజెక్టు ఇరిగేషన్ కాంపోనెంట్ ఖర్చు రూ. 20,398.61 కోట్లు. ఇందులో 2014 కంటే ముందు చేసిన ఖర్చు రూ. 4,730.71 కోట్లు. కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ. 15,667.90 కోట్లుగా ఉంది. రీయింబయర్స్మెంట్ రూపంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రూ. 14,418.39 కోట్లు చెల్లించింది. ఇంకా కేంద్రం చెల్లించాల్సిన మిగతా సొమ్ము రూ. 1,249.50గా ఉంది. పోలవరాన్ని మరో 41.15 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం చేపడితే.. అదనంగా రూ. 10,911.15 కోట్లు అవసరమవుతాయని కేంద్రాన్ని కోరిన ఏపీ ప్రభుత్వం. తాజా వరదల కారణంగా ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని రిపేర్ చేయడం కోసం అదనంగా మరో రూ. 2,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం రిపేర్ ఖర్చుతో కలుపుకుని మొత్తం రూ. 12,911.15 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.