CBN: ముగిసిన చంద్రబాబు కుప్పం పర్యటన.. లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా.తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 3 రోజుల కుప్పం పర్యటన ముగిసింది. బూత్ లెవెల్ నుంచి బహిరంగ సభతో పాటు లక్ష ఓట్ల మెజరిటీ క్యాంపియన్ టార్గెట్గా చంద్రబాబు పర్యటన ఈసారి వనూత్నంగా సాగింది. పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ పర్యటనలో కొత్త నాయకత్వానికి పెద్దపీట వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది…తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 3 రోజుల కుప్పం పర్యటన ముగిసింది. బూత్ లెవెల్ నుంచి బహిరంగ సభతో పాటు లక్ష ఓట్ల మెజరిటీ క్యాంపియన్ టార్గెట్గా చంద్రబాబు పర్యటన ఈసారి వనూత్నంగా సాగింది. పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ పర్యటనలో కొత్త నాయకత్వానికి పెద్దపీట వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే ఈసారి చంద్రబాబు కుప్పం పర్యటన ఈసారి ప్రత్యేకంగా సాగింది. కుప్పం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు.. గతంలో రోడ్ షోలు, గ్రామ గ్రామాన సభలు, రచ్చ బండ సభలు, మహిళల మంగళ హారతులు, బహిరంగ సభలు, సమావేశాలు, స్థానిక ఆలయాల్లో పూజలు, గ్రామాల్లోని ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లి పరామర్శలు చేసే చంద్రబాబు ఈసారి వాటన్నిటికీ దూరంగా పర్యటన సాగించారు.ఈ నెల 14 న కుప్పంకు చేరుకున్న చంద్రబాబు బిసీఎన్ కళ్యాణమండపంలో పార్టీ కేడర్ తో సమీక్షలతోనే గడిపారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో బసచేసి అక్కడ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన చంద్రబాబు 3 రోజులు బిసిఎన్ కళ్యాణమండపంలో కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల ముఖ్య నేతలతో, బూత్ కమిటీలతో, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే బాబు ఈ పర్యటనలో యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీలో చేరికలకు అంతే ప్రాధాన్యతనిచ్చారు. ప్రత్యేకించి లక్ష ఓట్ల మెజారిటీ క్యాంపెయిన్ పై దృష్టి పెట్టిన చంద్రబాబు పార్టీ కేడర్ లో టార్గెట్ ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఈ మేరకు లక్ష్యాన్ని చేరుకునేందుకు కేడర్ చేయాల్సిన పనికి దిశా నిర్దేశం చేశారు. బూత్ లెవెల్ నుంచి లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పనిచేయాలని టార్గెట్ ఫిక్స్ చేసారు. పోలింగ్ బూతుల వారీగా 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన మెజారిటీ, టిడిపికి పడ్డ ఓట్లు, 2024లో సాధించాల్సిన మెజారిటీని బూతు కమిటీలకు టార్గెట్లను ఫిక్స్ చేసిన చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 29 వేలకు పరిమితమైన మెజారిటీ గల కారణాలను అన్వేషిస్తూనే ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణాలను లెక్కిస్తూ 2024 ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ క్యాంపెయిన్ జనంలోకి తీసుకెళ్లే డైరెక్షన్ ఎలా ఉండాలో చంద్రబాబు సూటిగా చెప్పారు. ఈ మేరకు నేతలు ముక్కుసూటిగా పనిచేయాలన్న చంద్రబాబు యువతను ప్రోత్సహించారు.చేరికల విషయంలోనూ ఇదే ప్రాధాన్యత ఉందన్న చర్చ నడుస్తోంది.