Andhra Pradesh: విస్తరించనున్న రుతుపవనాలు.. ఏపీలో ఈ నెల 19 నుంచి వర్షాలే వర్షాలు..రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. ఇంకా నిప్పుల కొలిమిలా మండిపోతోంది. ఈ సమయంలో భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది.
రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. ఇంకా నిప్పుల కొలిమిలా మండిపోతోంది. ఈ సమయంలో భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఈ నెల 18 నుంచి 21 మధ్య నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నెల 19 నుంచి తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.అటు కోస్తాంద్రలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, గడిచిన మూడు వారాల నుంచి రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం విదితమే. అలాగే తీవ్రమైన వడగాల్పులు జనాల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. రుతుపవనాలు విస్తరించే వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీలు నమోదవుతాయని వాతావరణా అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.