Viral Video: పైకి చూస్తే థర్మోకోల్ బంతులు.. కానీ లోన ఎవ్వారం చూడగా మైండ్ బ్లాంక్..పైకి చూస్తే థర్మోకోల్ బంతులు.. కానీ లోన ఎవ్వారం చూడగా అధికారులకు మైండ్ బ్లాంక్ అయింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో..డ్రగ్స్.. మన దేశ యువతను పట్టి పీడిస్తున్న పెద్ద మహమ్మారి. యువతీ యువకలను టార్గెట్‌గా చేసుకుని డ్రగ్స్ పెడ్లర్లు రెచ్చిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు క్రియేటివిటీకి పదునుపెట్టి.. పోలీసులకు, నార్కోటిక్స్ బృందానికి చిక్కకుండా సరుకును కాస్తా బోర్డర్ దాటిస్తున్నారు. పలుసార్లు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా కూడా.. కొందరు ఈ దందాను ఆపట్లేదు.తాజాగా ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ థర్మోకోల్ బంతులు కన్సైన్మెంట్ బాక్స్ ద్వారా సీక్రెట్‌గా రవాణా అవుతున్న 1,922 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు రెవిన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు. రికవరీ చేసిన సరుకు సుమారు రూ. 26.5 కోట్లు విలువ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ కన్సైన్మెంట్ఎవరదన్న విషయం ఇంకా తెలియకపోగా.. దీనిపై లోతైన దర్యాప్తు చేపట్టారు అధికారులు. ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి అరెస్ట్‌లు జరగలేదు. అయితే అధికారులు ఆ థర్మోకోల్ బంతులు నుంచి కొకైన్‌ను తీస్తోన్న దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.