Rare Sword: స్మశానంలో తవ్వకాలు జరుపుతుండగా 3000 ఏళ్ల నాటి ఖడ్గం లభ్యం.. తళతళా మెరుస్తూ..నార్డ్లింగెన్ అనే చిన్న పట్టణంలోని పురాతన శ్మశానవాటికలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు చేపట్టారు. అప్పుడు అత్యంత అరుదైన ఖడ్గం బయపడింది. ఇది 3,000 సంవత్సరాల క్రితం కాంస్య యుగంనాటి అష్టభుజి ఖడ్గం గా గుర్తించారు. సమాధిలో ఖడ్గంతో పాటు ముగ్గురు వ్యక్తుల ఆనవాలు లభ్యంఅయ్యాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. సమాధిలో ఉన్నా సరే ఈ ఖడ్గం ఇప్పుడే తయారు చేసి మెరుగు పెట్టినట్లు తళతళా మెరిసిపోతూ ఉంది. దీని పనితీరుకి పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేసారు.మానవ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది అంటే.. ఇది అంటూ ఖచ్చితంగా ఏ శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. పూర్వకాలంలో మానవుని జీవితం విధానంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.. పరిశోధనలో భాగంగా జరిపే తవ్వకాల్లో నేటి మానవుడి మేధస్సుకు సవాల్ విసురుతూ అనేక అద్భుతమైన నిర్మాణాలు, వస్తువులు బయల్పడుతునే ఉన్నాయి. అలనాటి మానవుడి ఆలోచనాతీరు జీవన శైలీ, మేథస్సు షాక్ కలిగిస్తూనే ఉంది. తాజాగా శాస్త్రవేత్తల తవ్వకాల్లో అత్యంత అరుదైన ఖడ్గం బయల్పడింది. జర్మనీలో ఈ ఘటన వెలుగు చూసింది.గత వారం క్రితం నార్డ్లింగెన్ అనే చిన్న పట్టణంలోని పురాతన శ్మశానవాటికలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు చేపట్టారు. అప్పుడు అత్యంత అరుదైన ఖడ్గం బయపడింది. ఇది 3,000 సంవత్సరాల క్రితం కాంస్య యుగంనాటి అష్టభుజి ఖడ్గం గా గుర్తించారు. సమాధిలో ఖడ్గంతో పాటు ముగ్గురు వ్యక్తుల ఆనవాలు లభ్యంఅయ్యాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. సమాధిలో ఉన్నా సరే ఈ ఖడ్గం ఇప్పుడే తయారు చేసి మెరుగు పెట్టినట్లు తళతళా మెరిసిపోతూ ఉంది. దీని పనితీరుకి పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
సమాధుల్లోని మూడు మృతదేహాలలో ఒక పురుషుడు, స్త్రీ సహా ఒక యుక్తవయస్కుడు ఉన్నట్లు.. అయితే వీరి ముగ్గురుకి ఒకరితోనొకరికి సంబంధం ఉన్నదా లేదా అన్న విషయం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ అన్వేషణను మరింత వర్గీకరించడానికి పురావస్తు శాస్త్రవేత్తలు లభ్యమైన ఖడ్గాన్ని, సమాధిని మరింత లోతుగా పరిశీలించవలసి ఉందని మాథియాస్ ఫైల్ చెప్పారు.పురావస్తు శాస్త్రవేత్తలు కత్తిని 14వ శతాబ్దపు BCE నాటిదిగా గుర్తించారు వాస్తవానికి 3300BC నుండి 1200BC వరకు ఉన్న సమయాన్ని కాంస్య యుగం అని అంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బయటపడిన ఖడ్గం అసాధారణంఅని అరుదైనదని చెబుతున్నారు. ఈ కాలానికి చెందిన అత్యధిక కళాఖండాలు సహస్రాబ్దాలుగా దోచుకోబడుతున్నాయని పురావస్తు బృందం పేర్కొంది.
అయితే సమాధిలో ఇంతకాలం ఉన్నా ఈ కత్తి ఇప్పటికీ మెరుస్తూ మంచి స్థితిలో ఉంది. ఇంకా చెప్పాలంటే కత్తి ఉపయోగించినట్లు ఎటువంటి సంకేతాలు లేవు.. కనుక ఇది ఆచార సాంప్రదాయాను అనుసరించడం కోసం తయారు చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆకుపచ్చ రంగు కలిగిన ఈ ఖడ్గం కాంస్య, రాగి రెండింటినీ కలిగి ఉంది. కాలక్రమేణా రాగి ప్రత్యేకమైన రంగును సృష్టించడానికి ఆక్సీకరణం చెందింది. కత్తి భాగాలు దక్షిణ జర్మనీ, ఉత్తర జర్మనీ, డెన్మార్క్‌లో విడివిడిగా తయారు చేయబడి ఉండవచ్చు అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మరిన్ని పరిశోధన అనంతరం అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.