Salman Khan: సల్మాన్ ఖాన్ చేతికి ఉండే ఆ స్పెషల్ బ్రాస్లెట్ కథేంటో తెలుసా ?.. అసలు విషయం చెప్పిన భాయ్..సల్మాన్ చేతికి ఉండే బ్రాస్లెట్ ఎప్పుడైనా గమనించారా ?. సల్మాన్ అభిమానులను ఈ బ్రాస్లెట్ ఆకట్టుుకుంటుంది. సిల్వర్ కమ్ బ్లూ స్టోన్ బ్రాస్లెట్ ధరిస్తారు సల్మాన్. అయితే దానిని ధరించడం వెనక పెద్ద కథే ఉంది. ఇందుకు సంబంధించిన స్టోరీని సల్మాన్ చెబుతున్న ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో తాను ఆ బ్లూస్టోన్ బ్రాస్లెట్ ధరించడానికి గల కారణాన్ని స్వయంగా సల్మాన్ చెప్పుకొచ్చారు.బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు పాన్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. దక్షిణాదిలోనూ సల్లుభాయ్ కి మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కీలకపాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు సల్మాన్. ఇక కొద్ది రోజుల క్రితం కిసీ కి భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ .. ఈ సినిమా ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఇదిలా ఉంటే.. సల్మాన్ చేతికి ఉండే బ్రాస్లెట్ ఎప్పుడైనా గమనించారా ?. సల్మాన్ అభిమానులను ఈ బ్రాస్లెట్ ఆకట్టుుకుంటుంది. సిల్వర్ కమ్ బ్లూ స్టోన్ బ్రాస్లెట్ ధరిస్తారు సల్మాన్. అయితే దానిని ధరించడం వెనక పెద్ద కథే ఉంది. ఇందుకు సంబంధించిన స్టోరీని సల్మాన్ చెబుతున్న ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో తాను ఆ బ్లూస్టోన్ బ్రాస్లెట్ ధరించడానికి గల కారణాన్ని స్వయంగా సల్మాన్ చెప్పుకొచ్చారు.అప్పట్లో ఓ వేడుకలో పాల్గొన్న సల్మాన్ ను అక్కడే ఉన్న ఓ అభిమాని బ్రాస్లెట్ సీక్రెట్ ఏంటని అడుగ్గా… సల్మాన్ స్పందిస్తూ.. చిన్నప్పుడు ఆ బ్రాస్లెట్ తో ఆడుకునేవాడినని.. ఆ తర్వాత తాను సినీరంగంలోకి అడుగుపెట్టిన ప్రారంభంలో తన తండ్రి బాహుమతిగా ఆ బ్రాస్లెట్ ఇచ్చారని చెప్పారు. ఇక అందులో ఉండే బ్లూస్టోన్.. తనపై ఏదైనా నెగిటివిటీ వస్తే దానిని అడ్డుకుంటుందని..తనపై వచ్చే చెడు దృష్టిని ఆ రాయి తీసుకుంటుందని.. ఆ తర్వాత అది బ్రేక్ అవుతుందని చెప్పారు. అలాగే తాను ఇప్పటికీ 7 స్టోన్స్ మార్చినట్లు ఆ వీడియోలో చెప్పారు సల్మాన్.
ఆ బ్రాస్లెట్ తనకు చాలా ప్రత్యేకమని.. అందులో ఉండే రాయి ఫిరోజా రాయి అని అన్నారు సల్మాన్. ప్రపంచంలోని రెండు సజీవ రాళ్లలో ఈ ఫిరోజా రాయి ఒకటి. ఇది చాలా అరుదైన రాయిని అంటూ చెప్పుకొచ్చారు సల్మాన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇక సల్మాన్ చెప్పిన స్టోరీ చాలా సింపుల్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.