Allu Arjun: గ్రాండ్‌గా ప్రారంభమైన AAA సినిమాస్.. అల్లు అర్జున్ రాకతో దద్దరిల్లిన అమీర్ పేట్ఏషియన్ థియేటర్స్ తో కలిసి అల్లు అర్జున్ హైదరాబాద్ ఓ మల్టీప్లెక్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ట్రిపుల్ ఏ సినిమాస్ అనే పేరుతో ఈ థియేటర్ ను ప్రారంభించారు బన్నీ. ఈ థియేటర్ ఓపినింగ్ నేడు జరిగింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ ప్రారంభం అయ్యింది. పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్న అల్లు అర్జున్ తాజాగా థియేటర్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టరు. ఏషియన్ థియేటర్స్‌తో కలిసి అల్లు అర్జున్ హైదరాబాద్ ఓ మల్టిపెక్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ట్రిపుల్ ఏ సినిమాస్ అనే పేరుతో ఈ థియేటర్ ను ప్రారంభించారు బన్నీ. ఈ థియేటర్ ఓపినింగ్ నేడు జరిగింది. అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ ను మరమత్తులు చేసి అదిరిపోయే మల్టీప్లెక్స్ గా మార్చారు. ఈ ప్రారంభోత్సవం నేడు సందడిగా జరిగింది. మన భాషలో చెప్పాలంటే..అమీర్ పేట్ ఊగిపోయింది. కాదు కాదు.. దద్దరిల్లిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నినాదాలతో.. డాల్భీ రేంజ్ రీసౌండ్ చేసింది. కొట్టొచ్చినట్టు.. అందరూ షాకయ్యేట్టు.. టాలీవుడ్ గడ్డపై బన్నీ మేనియా ఏంటో.. మరో సారి తెలిసేలా చేసింది.
ఎప్పుడూ స్టూడెంట్స్‌తో.. సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్‌తో.. కళకళలాడుతూ ఉండే.. అమీర్ పేట్.. తాజాగా బన్నీ ఫ్యాన్స్ తో నిండిపోయింది. తన ట్రిపుల్ ఏ సినిమాస్ ప్రారంభోత్సవం సందర్భంగా.. బన్నీ రాక తెలుసుకున్న జనం తండోపతండోలుగా వచ్చారు. బన్నీని చూసేందుకు ఫోటోలు తీసుకునేందుకు.. వీడియోలు రికార్డ్ చేసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ట్రిపుల్ ఏ సినిమాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రారంభం కానుంది. రేపు జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఆదిపురుష్ సినిమాతో అల్లు అర్జున్ థియేటర్ ప్రారంభం కానుంది.