Actress: ఏకంగా ఎనిమిది భాషలు మాట్లాడగల హీరోయిన్ ఈ బుజ్జాయి.. ఎవరో గుర్తుపట్టారా.?ఈ మధ్య కాలంలో వస్తున్న హీరోయిన్స్ మూడు నాలుగు సినిమాలతోనే కనిపించకుండా పోతున్నారు. మరి కొంతమంది ఇతర భాషల్లోకి వెళ్లి అక్కడ రాణిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం చాలా కాలం ఇండస్ట్రీలో అభిమానులను అలరిస్తూ రాణించారు.సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం చాలా కష్టం.. ఈ మధ్య కాలంలో వస్తున్న హీరోయిన్స్ మూడు నాలుగు సినిమాలతోనే కనిపించకుండా పోతున్నారు. మరి కొంతమంది ఇతర భాషల్లోకి వెళ్లి అక్కడ రాణిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం చాలా కాలం ఇండస్ట్రీలో అభిమానులను అలరిస్తూ రాణించారు. పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు కూడా అదే కోవకి చెందుతుంది. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడిని చూస్తే ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని అంతా అనుకుంటారు అంత అందంగా ఉంటుంది ఈ భామ. పై ఫొటోలో క్యూట్ గా ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? స్టార్ హీరోయిన్ గా రాణించి ఆకట్టుకుంది ఈ భామ. ఇంతకు ఈ అమ్మడు ఎవరంటే.పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారి మరెవరో కాదు ఆ అమ్మడి పేరు అసిన్ . ఈ ముద్దుగుమ్మ ఎనిమిది భాషల్లో మాట్లాడగలదు. తన డబ్బింగ్ తానే చెప్పుకోగలదు ఈ చిన్నది. 15 ఏళ్లకే అసిన్ నటిగా ఎంట్రీ ఇచ్చింది. 2003లో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.
ఎం. కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఇక సూర్య హీరోగా నటించిన గజినీ సినిమాతో ఈ అమ్మడు రేంజ్ మారిపోయింది. ఈ సినిమాలో నటనకు ఉత్తమ నటిగా ఆసిన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. తమిళనాడు ప్రభుత్వం అసిన్ ను కలైమామణి అవార్డుతో సత్కరించింది . 2016లో రాహుల్ శర్మను వివాహం చేసుకుంది ఈ భామ.