Tamannaah Bhatia: మిల్కీబ్యూటీ బాయ్ ప్రెండ్ విజయ్ వర్మ బ్యాగ్రౌండ్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!!విజయ్ వర్మతో.. రిలేషన్లో ఉన్నట్టు తమన్నా చెప్పిన నేపథ్యంలో.. ఆమె లవర్ విజయ్ వర్మ గురించే ఇంట్రెస్టింగ్ టాపిక్ అంతటా రన్ అవుతోంది. ఇంతకీ విజయ్ వర్మ ఎవరు? పేరు చివర్లో వర్మ ఉందంటే..ప్రభాస్ ఆదిపురుష్ క్రేజ్ మధ్యలో కూడా.. ఓ రెండు రోజుల నుంచి.. సోషల్ మీడియాలో తమన్నా మ్యాటర్ వైరల్ అవుతోంది. అవును..! విజయ్ వర్మతో.. రిలేషన్లో ఉన్నట్టు తమన్నా చెప్పిన నేపథ్యంలో.. ఆమె లవర్ విజయ్ వర్మ గురించే ఇంట్రెస్టింగ్ టాపిక్ అంతటా రన్ అవుతోంది. ఇంతకీ విజయ్ వర్మ ఎవరు? పేరు చివర్లో వర్మ ఉందంటే.. తెలుగు వాడా..? తెలుగు టూ స్టేట్స్కు చెందిన వాడా..? ఒక వేళ కాకపోయి ఉంటే ఇంకెక్కడి వాడు? అనే డౌట్సే.. డిజిటల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తమన్నా.. తాను రిలేషన్లో ఉన్ననంటూ.. అనౌన్స్ చేసిన కుర్రాడు ఎవరో కాదు.. మన హైదరాబాద్ పిల్లాడు..! హైదరాబాద్ గల్లీల్లో తిరిగిన పిల్లాడు. తెలుగుతో పాటు.. హైదరాబాదీ ఉర్దూలో చకచకమాట్లాడే కుర్రాడు.ఇక్కడే మన దగ్గరే డిగ్రీ వరకు కూడా చదివారు. కానీ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండడంతో.. ఆ తరువాతే.. పూణె ఫిల్మ్ ఇనిస్ట్యూట్ లో సీటు సంపాదించి యాక్టింగ్‌లో గ్రాడ్యూయేషన్ పేర్తి చేశారు. ఆ తరువాత కొన్ని రోజులు హైదరాబాద్‌లోనే థియేటర్ ఆర్టిస్టుగా పని చేశారు. ఇక ఆ టైంలోనే అంటే 2008లో షోర్ అనే షార్ట్ ఫిల్మ్ తో తన యాక్టింగ్ కెరీర్‌ను విజయ్ వర్మ స్టార్ట్ చేశారు. ఆ తరువాత పలు హిందీ సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ.. అమితాబ్ తాప్సీ సూపర్ హిట్ మూవీ.. పింక్ సినిమాతో యాక్టర్‌గా పాపులారిటీ సంపాదించారు. ఇక ఆ సినిమాలో విజయ్ చేసిన యాక్టింగ్ కారణంగానే తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన MCA సినిమాలో విలన్ ఆఫర్ వచ్చేలా చేసుకున్నారు. తన యాక్టింగ్ తో.. తెలుగు టూ స్టేట్స్ ప్రజలను ఆకట్టుకున్నారు.
ఇక తాజాగా కరణ్ జోహార్ డైరెక్షన్లో లస్ట్ స్టోరీ టూ 2 సిరీస్ చేస్తున్నారు విజయ్ వర్మ. ఆ సెట్లోనే తమన్నాతో కలిసి పని చేసి.. అది కాస్తా ప్రేమ వరకు తెచ్చుకున్నారు. ముంబాయ్ వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగి ఇప్పుడు.. వన్ ఆఫ్ ది హాటెస్ట్ కపుల్ గా నెట్టింట ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు.