Telangana Politics: కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల చూపు..! మల్లు రవితో కీలక భేటీ..Telangana Politics: ఎన్నికల టైమ్ సమీపిస్తోంది. తెలంగాణ ఇంట్రస్టింగ్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. జంప్ జిలానీలతో సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా BRS ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామెదర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవితో భేటీ ఆసక్తిగా మారింది.Telangana Politics: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరుజిల్లా పాలిటిక్స్ పీక్స్‌కి చేరాయి. ఏ పార్టీ నేతలు ఏ పార్టీలోకి చేరతారో అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో గెలుపు కోసం అధికార, విపక్షపార్టీలు కసరత్తులు షురూ చేశాయి. పార్టీ మారాలనుకునే నేతలు మంతనాలు సాగిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అదే జోష్‌లో తెలంగాణలో తమదే గెలుపు అనే ధీమాతో ఉంది. BRS నుంచి తమ పార్టీలోకి ఎంతోమంది నేతలు రావటానికి ఆసక్తి చూపుతున్నారని..టీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.తాజాగా, BRS ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామెదర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవితో భేటీ అయ్యారు. వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. మల్లు రవి నివాసానికి వచ్చిన కూచుకుళ్ల దామెదర్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తన కుమారుడు రాజేశ్ రెడ్డిని కాంగ్రెస్ తరపున నాగర్‌కర్నూల్ నుంచి బరిలోకి దింపాలని కూచుకుళ్ల యోచిస్తున్నారు. అందులో భాగంగానే మల్లు రవితో సమావేశమయ్యారని తెలుస్తోంది.
మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొందరు నేతలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొల్లాపూర్‌కు చెందిన జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్లోచేరతారని ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు వనపర్తిజిల్లా పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డితోపాటు తన కుమారుడు రాజకీయ జీవితం కోసం కూచుకుళ్ల కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటానికి సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు నాగం జనార్థన్ రెడ్డికి, కూచుకుళ్లకు మధ్య విభేధాలు ఉండటంతో వీరిద్దరి మధ్య సర్ధుబాటు కోసం కాంగ్రెస్ యత్నిస్తోంది.కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గతంలో కాంగ్రెస్ తరఫున ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీగా గెలిచారు. గత కొంతకాలంగా నాగర్‌కర్నూల్ MLA జనార్థన్‌రెడ్డితో ఆయనకు విబేధాలు రావటంతో ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో గొడవ పెద్దదైంది. ఇక BRSలో ఇమడలేక కూచుకుళ్ల కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.