CSK-MS Dhoni: ధోని ‘ఐపీఎల్’ కెరీర్ ముగిసినట్లేనా..? సీఎస్కే పోస్ట్ చేసిన వీడియోకి అర్థం అదేనా..? ఆందోళనలో ఫ్యాన్స్..CSK-MS Dhoni: ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌ని ట్రోఫీ విన్నర్‌గా నిలిపిన ఆ టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఇప్పుడు లీగ్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన సారథిగా ముంబై ఇండియన్స్ నాయకుడు రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌ని..CSK-MS Dhoni: ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌ని ట్రోఫీ విన్నర్‌గా నిలిపిన ఆ టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఇప్పుడు లీగ్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన సారథిగా ముంబై ఇండియన్స్ నాయకుడు రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌ని ఘన విజయంతో ముగించుకున్న ధోని ఆ వెంటనే మోకాలి సర్జరీ కూడా విజయవంతంగా పూర్తి చేయించుకున్నాయి. ధోనికి సర్జరీ జరిగిన నేపథ్యంలో ఐపీఎల్ 17వ సీజన్లో అతను కనిపిస్తాడా, లేదా అనేది అనుమానంగానే ఉంది. అయితే తమ జట్టు కెప్టెన్‌కు భావోద్వేగమైన సందేశంతో ‘ఓ కెప్టెన్, మై కెప్టెన్’ అంటూ ఓ వీడియోను అంకితమించింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ అయిన ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అయితే తన తదుపరి సీజన్ గురించి ఎలాంటి ప్రకటన చేయకుండా.. రిటైర్మెంట్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా గందరగోళపు సమాధానాలు చెబుతుండేవాడు ధోని. కానీ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన వీడియో కారణంగా సీఎస్కే, ధోని ఫ్యాన్స్‌లో అనుమానాలు కలుగుతున్నాయి. ‘ఎంత మంది సారథిగా వచ్చినా నువ్వే మా కెప్టెన్’ అనే ఉద్దేశ్యంతోనే సీఎస్కే ఇలా వీడియో షేర్ చేసిందా..? ‘అంటే ధోనికి ఇదే లాస్ట్ సీజనా’.. అంటూ రకరకాలుగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.