Summer Riding Tips: మండే వేసవి తప్పనిసరై బైక్ రైడ్ చేయాలా? ఈ టిప్స్ పాటించకపోతే ఇక అంతే..!పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అనే చందంగా కొంతమంది ఎంత ఎండ ఉన్నా ఎండల్లో బైక్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఫీల్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. కొందరు తప్పనిసరై దూర ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఎండల్లో బండి తోలే సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు.తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణీ కార్తె ప్రభావంతో ఎండలు సాధారణ ప్రజలను ఇబ్బందిపెడుతున్నాయి. అయితే ఇలాంటి ఎండల్లో వేతన జీవులు, వ్యాపారస్తులు తప్పనిసరై తమ టూవీలర్స్‌ను నడపాల్సి ఉంటుంది. పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అనే చందంగా కొంతమంది ఎంత ఎండ ఉన్నా ఎండల్లో బైక్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఫీల్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. కొందరు తప్పనిసరై దూర ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఎండల్లో బండి తోలే సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు. అసలే బయట వాతావరణం వేడి దానికి తోడు బైక్ ఇంజిన్ నుంచి వెలువడే వేడి రెండు కలిపి ఒక్కోసారి బైక్ కాలిపోయిన సందర్భాలను మనం చాలా చూస్తాం. ముఖ్యంగా వేసవిలో బైక్ తోలినప్పుడు బైక్ రక్షణతో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణులు తెలిపే ఆ రక్షణ చర్యలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.హైడ్రేటెడ్‌గా ఉండడం
వేసవిలో తప్పనిసరై బయటకు వెళ్లిన సందర్భంలో కచ్చితంగా హైడ్రేటెడ్‌గా ఉండాలి. ముఖ్యంగా రైడింగ్ చేసే ముందు తగినన్ని నీళ్లు సేవించాలి. ముఖ్యంగా మనతో పాటు ఓ వాటర్ బాటిల్ ఉంచుకోవడం ఉత్తమం.
మంచి డ్రెస్
వేసవిలో రైడింగ్ చేసే సమయంలో మంచి డ్రెస్ ఎంచుకోవడం తప్పనిసరి. గాలి ప్రసరణలో ఇబ్బంది లేని కాటన్ దుస్తులను ఇలాంటి సమయంలో ధరించడం ఉత్తమం. తేమను దూరం చేసే తేలికైన మెష్ జాకెట్లు, వెంటిలేటెడ్ రైడింగ్ ఫ్యాంట్లను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
హెల్మెట్ ఎంపిక
వేసవిలో బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా మంచి హెల్మెట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గాలి ప్రవాహాన్ని అనుమతించేలా ఉన్న హెల్మెట్‌ను ఎంచుకోవాలి. ముఖ్యంగా అన్ని భద్రతా ప్రమాణాలు పాటించి ఉన్న హెల్మెట్‌ను ఎంచుకుంటే మన ప్రాణాలకు రక్షణ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
కంటి రక్షణ
ఎండల నుంచి కంటి రక్షణ కోసం మంచి సన్ గ్లాసెస్‌ను ఎంచుకోవాలి. హానికరమైన కిరణాల నుంచి మీ కళ్ల రక్షణ కోసం యూవీ రక్షణతో ఉన్న లెన్స్‌లను ఎంచుకోవాలి. యాంటి ఫాగింగ్ ఉత్పత్తులతో పాటు అంతర్నిర్మిత యాంటి ఫాగ్ విజర్‌తో ఉన్న హెల్మెట్లను ధరించాలి.
పాదరక్షలు
ముఖ్యంగా వేసవిలో బండిపై బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా కంఫర్ట్‌గా ఉండే పాదరక్షలు ఉపయోగించడం ఉత్తమం. గాలిని సమర్థంగా ప్రసరించేలా వెంటిలేటెడ్ రైడింగ్ బూట్లు లేదా షూలు ఎంచుకోవాలి. మీ పాదాలను ఎప్పుడూ చల్లగా, పొడిగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.చర్మ రక్షణ
వేసవిలో బయటకు వెళ్తే అధిక ఎండల కారణంగా చర్మం ఆరోగ్యం క్షీణిస్తుంది. అందువల్ల కచ్చితంగా బయటకు వెళ్లే ముందు సన్ స్క్రీన్ క్రీములను రాసుకోవాలి. కొంచెం జిడ్డుగా ఉన్నప్పటికీ సన్ స్క్రీన్ క్రీమ్ చర్మ ఆరోగ్యానికి గణనయమైన మేలు చేస్తుంది.