Kids Skin Problems: మీ పిల్లలు తామర సమస్యతో బాధపడుతున్నారా? కారణం అదే అంటున్న నిపుణులు.. అదేంటో తెలుసుకోండిఅధ్యయనం ప్రకారం యూఎస్‌లో దాదాపు 10 మిలియన్ల మంది పిల్లలు అటోపిక్ చర్మవ్యాధిని కలిగి ఉన్నారని అంచనా అంటే దాదాపు మూడింట ఒక వంతు మంది మితమైన లేదా తీవ్రమైన వ్యాధిని కలిగి ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ శ్వాసకోశ ఆరోగ్యంపై ట్రాఫిక్ సంబంధిత వాయు కాలుష్యం హానికరమైన ప్రభావం క్షుణ్ణంగా నమోదైంది.అటోపిక్ డెర్మటైటిస్ అంటే తామర ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అటోపిక్ మార్చ్ అని కూడా పిలిచే అలెర్జీ వ్యాధుల పురోగతి ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా ఉంది. ఓ అధ్యయనం ప్రకారం యూఎస్‌లో దాదాపు 10 మిలియన్ల మంది పిల్లలు అటోపిక్ చర్మవ్యాధిని కలిగి ఉన్నారని అంచనా అంటే దాదాపు మూడింట ఒక వంతు మంది మితమైన లేదా తీవ్రమైన వ్యాధిని కలిగి ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ శ్వాసకోశ ఆరోగ్యంపై ట్రాఫిక్ సంబంధిత వాయు కాలుష్యం హానికరమైన ప్రభావం క్షుణ్ణంగా నమోదైంది. అయితే తాజాగా వాయు కాలుష్యం చర్మ సమస్యలకు కూడా కారణం అవుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. యూఎస్‌లోని కొలరాడో రాష్ట్రంలో ఎక్కువగా రహదారుల్లో ప్రయాణించే పిల్లలు, అలాగే రోడ్డు పక్కన ఉండే పిల్లల చర్మ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ముఖ్యంగా ఈ చిన్నారులకు అటోపిక్ డెర్మటైటిస్ అభివృద్ధి చెందే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా రహదారి నుంచి 500 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకూ నివసించే చిన్నారుల్లో అటోపిక్ చర్మశోథ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.తాజా పరిశోధనల్లో బట్టి చూస్తే చిన్న పిల్లలను వీలైనంతగా ట్రాఫిక్‌కు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. తామర ఉన్న పిల్లల్లో చర్మం ఉపరితలం లీక్, పర్యావరణ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇది అలెర్జీ ప్రతిస్పందనకు దారితీస్తుంది. బహుశా ఆహార అలెర్జీలు, ఉబ్బసం, ఇతర సమస్యలకు దారితీయవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 2008 నుంచి 2021 వరకూ డెన్వర్‌లోని నేషనల్ జ్యూయిష్ హెల్త్‌లో కనిపించిన 0-18 సంవత్సారాల వారిని పరిశీలిస్తే ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి వారు రహదారుల నుంచి ఎంత దూరంలో ఉన్నారో? అనే విషయాన్ని బట్టి అంచనా వేశారు. అంటే రోజు వారి 10,000 వాహనాల కంటే ఎక్కువ వాహనాలు ప్రయాణించే రహదారి పరిధిలో నివసించే చిన్నారులకే ఎక్కువ చర్మ వ్యాధులకు గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తిని అనురించి ఇచ్చింది. దీనికి ఎటువంటి శాస్త్రీయ అధరాలు లేవు. కనుక వీటిని పాటించే ముందు నిపుణుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.