Tirumala: తిరుమల ఘాట్ రోడ్లో వరస ప్రమాదాలు.. టీటీపీ కీలక నిర్ణయం.. ఈ నెల 14న శాంతి హోమంఇటీవల కాలంలో తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. వరస యాక్సిండెంట్స్ నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీ బుధవారం తిరుమల ఘాట్రోడ్డులో మహా శాంతి హోమం నిర్వహించనున్నారు.కలియుగ వైకుంఠం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. క్షేత్రంలోని అన్నీ మార్గాల్లో భక్తులు బారులు తీరారు. టోకెన్ లేని భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. వరస యాక్సిండెంట్స్ నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల 14వ తేదీ బుధవారం తిరుమల ఘాట్రోడ్డులో మహా శాంతి హోమం నిర్వహించనున్నారు. ఫస్ట్ డౌన్ ఘాట్ రోడ్డులోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయం సమీపంలోని 7వ మైలు వద్ద ఈ హోమం జరగడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హోమాన్ని నిర్వహించనున్నారు.
ఎగువ-లోయర్ ఘాట్ రోడ్లపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మానవాళి, లోక కల్యాణం కోరుతూ ఈ ప్రత్యేక హోమం నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సిద్ధపడుతున్నారు. ఈ హోమ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొంటారు. ఈ హోమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రసారం చేయనున్నారువాస్తవానికి మూడు రోజుల కిందటే రెండో ఘాట్ రోడ్డులో తిరుపతి నుంచి తిరుమల వెళ్తుండగా టెంపో ట్రావెలర్ కొండను ఢీ కొంది.
అంతకముందు మొదటి ఘాట్ రోడ్డులోని 28వ మలుపు వద్ద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇలా తిరుమల ఘాట్ రోడ్లపై వరస ప్రమాదాలు గతంలో ఎన్నడూ జరగలేదు. అయితే ఈ ప్రమాదాల్లో ఎవరూ ప్రాణాలు పోగొట్టుకోక పోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.