Kriti Sanon: నిర్మాతగా మారనున్న కృతి సనన్.. కానీ థియేటర్లలో కాదు..ఇదిలా ఉంటే.. తాజాగా కృతి సనన్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇప్పటివరకు కథానాయికగా అలరించిన కృతి.. ఇప్పుడు నిర్మాతగా మారనుందట. కానీ థియేటర్లలో విడుదల కాబోయే సినిమాల కోసం కాదు.. ఓటీటీ చిత్రాలకు అని.కృతి సనన్.. ఇప్పుడు దేశమంతా వినిపిస్తోన్న పేరు ఇది. ఇప్పటివరకు బాలీవుడ్ హీరోయిన్గా మాత్రమే కొద్ది మందికి సుపరిచితమైన ఈ బ్యూటీ… ఇప్పుడు సీతమ్మగా అభిమానుల ముందుకు రాబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో కనిపించంనుంది కృతి. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. డైరెక్టర్ ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరో నాలుగు రోజుల్లో (జూన్ 16న) ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీగానే అంచనాలు ఉండగా.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఆదిపురుష్ చిత్రయూనిట్ మాత్రం ప్రమోషన్స్, ఇంటర్వ్యూలకు దూరంగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా కృతి సనన్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇప్పటివరకు కథానాయికగా అలరించిన కృతి.. ఇప్పుడు నిర్మాతగా మారనుందట. కానీ థియేటర్లలో విడుదల కాబోయే సినిమాల కోసం కాదు.. ఓటీటీ చిత్రాలకు అని.బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాకు కృతి సనన్ నిర్మాతగా వ్యవహరిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి తాజాగా 9ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తనను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
“నేను ఎలాంటి పాత్రలలోనైనా నటించగలనని దర్శకులకు నాపై పూర్తి నమ్మకం ఉంది. ఆదిపురుష్ సినిమాలో సీతగా నన్ను ఎంపిక చేశారంటే అది నా అదృష్టంగా భావిస్తాను. ప్రస్తుతం నా కెరీర్లో ఉత్తమ దశలో ఉన్నానని నాకు అనిపిస్తుంది. నేను వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సినీరంగంపై ఎంతో గౌరవంతో నటిస్తున్నాను. మనం చేసే పనిని ఇష్టపడితే అందులో కష్టం ఉన్నప్పటికీ అది మనపై ప్రభావం చూపదు. ఈరోజు నేను స్టార్ హీరోయిన్ గా ఎదిగినా వ్యాపారవేత్తగా మారినా .. వీటన్నింటికీ ఇదే కారణం. నేను నా పనిని ప్రేమిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది.