జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.ఈ సందర్భంగా ఆయన ట్విటర్ మరియు ఫేస్ బుక్ లో ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఇది ఇలా ఉండగా ఈ ప్రమాదం కొంత మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు.
Odisha Train Accident – Pawan Kalyan : ఈరోజు తెల్లవారుజామున మనం నిద్ర లెయ్యగానే ఘోరమైన వార్త వినాల్సి వచ్చింది. ఒడిస్సా ప్రాంతం లోని బాలేశ్వర్ సమీపంలో యస్వంత్ పూర్ ఎక్స్ప్రెస్ మరియు కోరోమండల్ ఎక్స్ ప్రెస్ రెండు ఢీకొని 250 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలు అవ్వగా, 50 మందికి పైగా మృతి చెందిన సంఘటన యావత్తు ప్రజానీకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసింది. రైల్వే డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల దేశం లో చోటు చేసుకున్న అత్యంత ఘోర ప్రమాదానికి గురైన సంఘటనలలో ఒకటిగా నిల్చింది.
ఈ సంఘటన కి సంబంధించిన విజువల్స్ చూస్తుంటే మన హృదయాలు తరుక్కు పోతాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే సినీ , రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన హీరోలు , హీరోయిన్లందరూ కూడా ఈ విచార సంఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
వారిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.ఈ సందర్భంగా ఆయన ట్విటర్ మరియు ఫేస్ బుక్ లో ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఇది ఇలా ఉండగా ఈ ప్రమాదం కొంత మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది తీవ్రమైన గాయాలపైతే మరికొంత మంది ప్రాణాలను విడిచేసారు. వీళ్ళ కుటుంబాల కోసం పవన్ కళ్యాణ్ త్వరలోనే కొంత డబ్బు విరాళం గా ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.
త్వరలోనే ఈ కుటుంబాలను సందర్శించి, వాళ్ళల్లో ధైర్యాన్ని నింపబోతున్నారు పవన్ కళ్యాణ్. గతం లో కూడా ఆయన ఇలాంటి విపత్కర సందర్భాలు వచ్చినప్పుడు తన వంతుగా సహాయం చేసాడు. ఇప్పుడు కూడా ఆయన సహాయం చెయ్యబోతున్నాడు అంటూ వస్తున్నా వార్తలను చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గర్వం తో ఇది నా హీరో అంటే, జై పవర్ స్టార్ అని పోస్టులు వేస్తున్నారు.