దీనిపై లావణ్య త్రిపాఠి పలు ఇంటర్వ్యూస్ లో అలాంటిది ఏమి లేదని చెప్పింది కానీ, చివరికి వీళ్లిద్దరు ఈ నెల 9 వ తారీఖున నిశ్చితార్థం ద్వారా ఒక్కటి అవ్వబోతున్నారు.ఇక వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నుండి అధికారిక ప్రకటన రావడం ఒక్కటే బ్యాలన్స్.
Nagababu- Varun Tej: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం అవుతున్న వార్త వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం. చాలా కాలం నుండి వీళ్లిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారని. ఈ ఇద్దరి ప్రేమకి ఇరువురి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, త్వరలోనే పెళ్లి బజంత్రీలు మోగబోతున్నాయని వార్తలు ప్రచారం అయ్యాయి.
దీనిపై లావణ్య త్రిపాఠి పలు ఇంటర్వ్యూస్ లో అలాంటిది ఏమి లేదని చెప్పింది కానీ, చివరికి వీళ్లిద్దరు ఈ నెల 9 వ తారీఖున నిశ్చితార్థం ద్వారా ఒక్కటి అవ్వబోతున్నారు.ఇక వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నుండి అధికారిక ప్రకటన రావడం ఒక్కటే బ్యాలన్స్. ఏ క్షణం లో అయిన వాళ్ళు దీనిపై అధికారిక ప్రకటన చెయ్యబోతున్నారు. అయితే రీసెంట్ గా నాగబాబు పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో వరుణ్ తేజ్ పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.
సోషల్ మీడియా లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి, దీనికి మీరు ఇచ్చే సమాధాన ఏమిటి అని నాగ బాబు ని విలేఖరి అడగగా ‘పెళ్లి త్వరలోనే చెయ్యబోతున్నాము కానీ, పెళ్లి కూతురు ఎవరూ ఏమిటి అనేది వరుణ్ బాబు తెలియచేస్తాడు, అప్పటి వరకు నేను నోరు విప్పను, నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను వదిలేయండి’ అంటూ వ్యగ్యంగా సమాధానం ఇచ్చాడు.
లావణ్య త్రిపాఠి తో పెళ్లి అనే వార్త అబద్దం అయ్యుంటే, అబద్దం అని నాగబాబు చెప్పేవాడు కదా, చెప్పలేదంటే కచ్చితంగా వాళ్ళ పెళ్లి ఖరారు అయ్యినట్టే కదా అని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు వరుణ్ తేజ్ నుండి క్లారిటీ కోసం అటు మెగా అభిమానులతో పాటుగా, టోటల్ టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది.