ఇదేం బౌలింగ్ సామీ.. గింగిరాలు తిరిగే మిస్టరీ బంతికి.. బ్యాటర్‌కు మాస్టర్ స్ట్రోక్.. వైరల్ వీడియో!క్రికెట్ పిచ్ పొడవు 22 గజాలు ఉంటుంది. కానీ, 26 ఏళ్ల బౌలర్ మార్క్ వాట్ మాత్రం 25 గజాల దూరం నుంచి.. బ్యాటర్ అలెక్స్ హేల్స్ వికెట్ పడగొట్టాడు.క్రికెట్ పిచ్ పొడవు 22 గజాలు ఉంటుంది. కానీ, 26 ఏళ్ల బౌలర్ మార్క్ వాట్ మాత్రం 25 గజాల దూరం నుంచి.. బ్యాటర్ అలెక్స్ హేల్స్ వికెట్ పడగొట్టాడు. ఓ భారీ షాట్ ఆడబోయి చివరికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు హేల్స్. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టీ20 వైటిలిటీ బ్లాస్ట్‌లో ఇటీవల నాటింగ్‌హామ్‌షైర్, డెర్బీషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడుతోన్న ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్ హేల్స్ బరిలోకి దిగాడు. ఇక స్కాటిష్ బౌలర్ మార్క్ వాట్ డెర్బీషైర్ జట్టుకు ఆడుతున్నాడు. నాటింగ్‌హామ్‌షైర్ ఇన్నింగ్స్‌లోని 12వ ఓవర్లో అలెక్స్ హేల్స్ 30 బంతుల్లో 35 పరుగులతో ఆడుతున్నాడు. ఆ సమయంలో బౌలింగ్ చేస్తున్న మార్క్ వాట్.. ఓవర్ నాలుగో బంతికి హేల్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
అలాగే ఈ వికెట్ 25 గజాల నుంచి బౌలింగ్ చేసి తీయడం విశేషం. సాధారణంగా బౌలర్లు 22 గజాల నుంచి బౌలింగ్ చేస్తారు. క్రీజ్‌ను పూర్తిగా ఉపయోగించుకుంటారు. మార్క్ వాట్ కూడా అదే చేస్తాడు. కానీ 22 గజాల నుంచి కాదు.. 25 గజాల నుంచి బౌలింగ్ చేస్తాడు. కాగా, ఈ మ్యాచ్‌లో డెర్బీషైర్‌పై నాటింగ్‌హామ్‌షైర్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేయగలిగింది. దీనికి సమాధానంగా నాటింగ్‌హామ్‌షైర్ 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసి.. 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.