Watch Video: కాలేజీకి వెళ్తున్న అమ్మాయి వెంటపడ్డాడు.. చివరికి చెప్పుతో చెంప చెల్లుమనిపించిందిసాధారణంగా కొంతమంది పోకిరీలు అమ్మాయిల వెంట పడతారు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడిస్తుంటారు. ఇలా చేస్తే కొంతమంది అమ్మాయిలు వెంటపడద్దొంటు హెచ్చరిస్తుంటారు మరికొందరు వాళ్ల తల్లిదండ్రులకు ఈ విషయం చెబుతారు. కానీ కర్ణాటకలోని ఓ అమ్మాయి తనని వెంబడించిన యువకుడిపై రెచ్చిపోయింది.సాధారణంగా కొంతమంది పోకిరీలు అమ్మాయిల వెంట పడతారు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడిస్తుంటారు. ఇలా చేస్తే కొంతమంది అమ్మాయిలు వెంటపడద్దొంటు హెచ్చరిస్తుంటారు మరికొందరు వాళ్ల తల్లిదండ్రులకు ఈ విషయం చెబుతారు. కానీ కర్ణాటకలోని ఓ అమ్మాయి తనని వెంబడించిన యువకుడిపై రెచ్చిపోయింది. రోడ్డుపైనే అతని చొక్కా పట్టుకొని చెప్పుతో కొట్టి సమాధానమిచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఉడిపి జిల్లాలోని కుందపురాకులో ఓ అమ్మాయి ఉంటోంది. రోజూలాగే తన హాస్టల్ నుంచి కాలేజ్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలోనే ఓ 35 ఏళ్ల వ్యక్తి ఆమెను గమనించాడు.
ఆమెను వెంబడిస్తూ.. వేధించసాగాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. ఆమెను చూసిన స్థానికులు ఆ యువకుడ్ని పట్టుకున్నారు. ఆమె కోపంతో అందరి ముందు చెప్పు తీసుకొని అతడి చెంప వాయించేసింది. తన కోపాన్నంత అతనిపై తీర్చుకుంది. తనను వదిలిపెట్టండంటూ ఆ వ్యక్తి వేడుకున్నాడు. చివరికి స్థానికులు అతడ్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని నజీర్‌గా గుర్తించారు. అతడ్ని ఆ యువతి చెప్పుతో కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.