కియా సెల్టోస్ ను భారత్ లో 2019 ఆగస్టులో మార్కెట్లోకి తీసుకొచ్చారు. కంపెనీ నుంచి రిలీజైన మోడళ్లలో ఇది అత్యుత్తమంగా నిలిచింది. దీనిని ముందుగా సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాల్లో ప్రవేశపెట్టారు.
Kia Seltos Sales: దక్షిణ కొరియాకు చెందిన కియా ఇండియాలో కొత్త రికార్డు నమోదు చేసుకుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన SUV కార్లలో సెల్టోస్ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. సెల్టోస్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన 46 నెలల్లోనే 5 లక్షల యూనిట్లు విక్రయించినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఈ మోడల్ ను వినియోగదారులను విపరీతంగా ఆకర్షించడంతో పాటు ఫీచర్లు అనుగుణంగా ఉండడంతో సెల్టోస్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయని అంటున్నారు. అతి తక్కువ కాలంలోనే ఇంత వృద్ధి సాధించినందుకు కంపెనీ నిర్వాహకులు తమ ఉద్యోగులను అభినందించారు.
కియా సెల్టోస్ ను భారత్ లో 2019 ఆగస్టులో మార్కెట్లోకి తీసుకొచ్చారు. కంపెనీ నుంచి రిలీజైన మోడళ్లలో ఇది అత్యుత్తమంగా నిలిచింది. దీనిని ముందుగా సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాల్లో ప్రవేశపెట్టారు. 2020 మార్చి చివరి వరకు సెల్టోస్ కాంపాక్ట్ 81,784 విక్రయాలు జరుపుకుంది. ప్రస్తుతం కియా సెల్టోస్ రెండు ట్రిమ్ లలో అందుబాటులో ఉంది. టెక్ లైన్, జిటి లైన్ అనే రెండు మోడళ్లు ఆకర్షిస్తున్నాయి. దీనిని మరో 10 వేరియంట్లుగా విభజించారు.
సెల్టోస్ ప్రారంభ ధర ఎక్స్ షో రూం ధర రూ.9.89 లక్షలు నుంచి రూ.17.34 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరలు SUV 2020 హ్యుందాయ్ క్రెటా, MG హెక్టర్, టాటా హరియర్, జీప్ కంపాస్, మహీంద్రా XUV500 వంటి వాటికి పోటీనిస్తుంది. ఇక ఇండియాలో ఉత్పత్తి అయినా కియా సెల్టోస్ ను ఇప్పటి వరకు 1,35,885 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేశారు. ప్రతీ నెల దాదాపు 9,000 కార్లు అమ్ముతున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది మొదటి 3 నెలల కాలంలో 27,159 కార్లను వినియోగదారులకు అందించినట్లు పేర్కొన్నారు.
కియా సెల్టోస్ 1.4 లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ 1.5 లీటర్ స్మార్ట్ స్ట్రీమ్ పెట్ోల, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. మూడు ఇంజన్ల ప్రామాణికంగా ఈ వెహికిల్ పనిచేస్తుంది. 6 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ ఉన్నాయి. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఫ్రంట్ గ్రిల్, ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్ లు, ఎల్ ఈడీ డీఆర్ఎల్ లు, ఎల్ ఈడీ ఫాగ్ ల్యాంప్స్ , ఎల్ఈడీ లెడ్ లైట్లు ఉన్నాయి. డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపులు ఉన్నాయి. 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ తో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ AVN సిస్టమ్, మూడు స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.