తాజాగా ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. దేవర చిత్రంలో జాన్వీ కపూర్ అండర్ కవర్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారట. అమాయకంగా కనిపించే ఆమె లుక్ వెనుక షాకింగ్ ట్విస్ట్ దాగి ఉంటుందట.
Janhvi Kapoor: దర్శకుడు కొరటాల శివ వాయు వేగంతో దేవర మూవీ పూర్తి చేస్తున్నారు. విడుదలకు పది నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో షూటింగ్ పార్ట్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఫస్ట్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. విలన్ సైఫ్ అలీ ఖాన్-ఎన్టీఆర్ మీద యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. ఒక ట్రైన్ ఫైట్ కూడా చిత్రీకరించారని సమాచారం. దేవర షూటింగ్ నిరవధికంగా సాగనుంది.
దేవర చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు ఇది ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ. అలాగే మొదటిసారి ఓ స్టార్ కి జంటగా నటిస్తుంది. దేవర మూవీ నుండి జాన్వీ కపూర్ లుక్ విడుదల చేశారు. ఆమె లంగా ఓణీలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించారు. ఆమె కళ్ళలో అమాయకత్వం, వేదన కనిపిస్తుంది. అలాగే దేవర మూవీ ఓపెనింగ్ డే నాడు దర్శకుడు కొరటాల శివ ఆమె పాత్ర గురించి కీలక కామెంట్స్ చేశారు. కథలో చాలా బలంగా ఆమె పాత్ర ఉంటుందన్నారు.
తాజాగా ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. దేవర చిత్రంలో జాన్వీ కపూర్ అండర్ కవర్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారట. అమాయకంగా కనిపించే ఆమె లుక్ వెనుక షాకింగ్ ట్విస్ట్ దాగి ఉంటుందట. అది రివీల్ అయ్యే సీన్ గూస్ బంప్స్ లేపుతుందట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ వార్త దేవర మూవీపై మరింత హైప్ పెంచేసింది.
ఇక ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. నెవెర్ బిఫోర్ మాస్ అవతార్ లో ఎన్టీఆర్ గూస్ బంప్స్ లేపాడు. దేవర చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. 2024 సమ్మర్ కానుకగా దేవర విడుదల కానుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.