దీంతో అంతర్జాతీయ నగరాల జాబితాలోనూ భారత్ లోని కొన్ని నగరాలు తమ స్థానాలు మార్పులు చేసుకున్నాయి ఐరోపావంటి ప్రాంతాల్లో వస్తు సేవల ధరలు మారడంతో భారత్లో ఎక్కువ కొనుగోలు శక్తి పెరిగింది. దీంతో ధరలు కూడా అధికంగానే పెరిగినట్లు సర్వేలో తేలింది.
Hyderabad : తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు మరో విశేష గుర్తింపు వచ్చింది. మొన్నటి వరకు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందిన భాగ్యనగరం.. ఇప్పుడు ఖరీదైన నగరాల జాబితాలో చోటు దక్కింది. భారతదేశంలో విదేశీయులు హైదరాబాద్ ను కాస్ట్ లీ నగరంగా గుర్తించడంతో ఆసక్తికరంగా చర్చ సాగుతుంది. హైదరాబాద్ తో పాటు దేశంలోని మరికొన్ని నగరాలు ఖరీదైన జాబితాలో చోటు చేసుకున్నాయి దక్కించుకున్నాయి .
మెర్సర్స్ సంస్థ చేసిన ‘కాస్ట్ ఆఫ్ లివింగ్ 2023’ అనే సర్వే ప్రకారం.. ప్రతి నగరంలో ఆహారం, వసతి, ఫర్నిచర్, ఇతర సౌకర్యాలను బేస్ చేసుకుని వీటికి ఏ నగరంలో ఎక్కువ ఖర్చు అవుతుందో అని గుర్తించి ఆయా నగరాన్ని కాస్ట్లీ నగరంగా పేర్కొన్నారు. ఈ సంస్థ భారత్లో జరిపిన సర్వేలో అత్యంత కాస్ట్లీ నగరంగా ముంబై మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ, కోల్ కతా, పూణె, ఉన్నాయి. ముంబైతో పోలిస్తే చెన్నై, హైదరాబాద్, కోల్ కతా,పూణేల్లో వసతి ఖర్చులు 50 శాతం తక్కువగా ఉన్నాయి. విదేశీ ఉద్యోగులకు కోల్కతాలో అత్యంత తక్కువ ఖర్చు అవుతున్నట్లు సర్వేలో తేలింది.
ప్రపంచవ్యాప్తంగా జరిపిన సర్వేల్లో ముంబైకి 147 వ స్థానం దక్కింది. అలాగే ఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్ 202, కోల్కతా 211, పూణె, 213 స్థానాల్లో ఉన్నాయి. దేశంలో కోల్కతా పూనే వంటి నగరాల కంటే హైదరాబాదులోనే ఎక్కువ ఖరీదు ఉన్నట్లు తేలింది.
విదేశీ కార్యకలాపాలు నిర్వహించాలనుకునే సంస్థలకు ఆసియా వైడ్ గా చూస్తే షాంగై, బీజింగ్, టోక్యోల కంటే ముంబై ఢిల్లీ నగరాలే ఎక్కువ కాస్ట్లీ గా ఉన్నాయని తేలింది. దీంతో అంతర్జాతీయ నగరాల జాబితాలోనూ భారత్ లోని కొన్ని నగరాలు తమ స్థానాలు మార్పులు చేసుకున్నాయి ఐరోపావంటి ప్రాంతాల్లో వస్తు సేవల ధరలు మారడంతో భారత్లో ఎక్కువ కొనుగోలు శక్తి పెరిగింది. దీంతో ధరలు కూడా అధికంగానే పెరిగినట్లు సర్వేలో తేలింది.