తులసి మొక్క ఎండిపోతే కూడా అరిష్టంగానే చెబుతారు. తులసి మొక్క ఎండిపోతే దాన్ని తీసి పారే నీళ్లలో వేయడం వల్ల మనకు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలా చేయడం కుదరకపోతే గొయ్యి తీసి మట్టిలో పాతిపెడితే మంచిది.
తులసిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపంగా చెబుతారు. ఆయనకు తులసీమాల వేసేందుకు ఇష్టపడతారు. తులసిలో లక్ష్మీదేవి కూడా కొలువుంటుందని నమ్మకం. అందుకే తులసి మన జీవితంతో ముడిపడి ఉంది. తులసి ఇంట్లో ఉంచుకుంటే మనకు అనుకూల ఫలితాలే వస్తాయి. చెడును దూరం చేసే గుణం తులసిలో ఉంటుందని విశ్వాసం.
తులసిని ఎటు వైపు పెంచుకోవాలి? ఏ వైపు పడితే ఆ వైపు తులసిని పెంచుకోవడానికి వాస్తు శాస్త్రం ఒప్పుకోదు. తులసిని ఉత్తరం, ఈశాన్యం, తూర్పు వైపుల్లో మాత్రమే పెంచుకోవాలి. దక్షిణం వైపు పెంచితే మనకు నష్టాలు వస్తాయి. పశ్చిమం వైపు కూడా పెంచుకోవడం సురక్షితం కాదు. తులసి మొక్కను పెంచుకునే క్రమంలో ఈ నిబంధనలు పాటించాలి.
తులసి మొక్క ఎండిపోతే కూడా అరిష్టంగానే చెబుతారు. తులసి మొక్క ఎండిపోతే దాన్ని తీసి పారే నీళ్లలో వేయడం వల్ల మనకు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలా చేయడం కుదరకపోతే గొయ్యి తీసి మట్టిలో పాతిపెడితే మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఆస్కారం ఉంటుంది. సంపద సమృద్ధిగా కలగాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి ప్రయోజనాలు దక్కుతాయి.