అందుకే వేతన సవరణ సంఘం ద్వారా ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. జూలై నుంచి కొత్త వేతన స్కేల్ అమలు చేయాల్సి ఉంది. పీఆర్సీ వేతనాలతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాల పైన ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.
AP Employees : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో దూరమైన వర్గాలను దగ్గర చేర్చుకునేందుకు సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ చర్యలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు దూరమయ్యారు.
బద్ధ శత్రువులుగా మారిపోయారు. అటు ప్రభుత్వం సైతం ఇన్నాళ్లూ వారి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తోంది. ఎన్నికల్లో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారని బలంగా నమ్ముతోంది. అందుకే వారిని టార్గెట్ చేసుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అంశాల్లో ముఖ్యమైన 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు డిసైడయ్యింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని సీఎంవో ఆదేశాలిచ్చింది.
పీఆర్సీ, వేతన బకాయిలు, ఫిట్ మెంట్.. ఇలా అన్నింటికీ ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పుడు ఎన్నికల ఏడాది కావడంతో ఉద్యోగుల ఆందోళనలు తీవ్రతరమవుతాయని తెలుసు. అందుకే వేతన సవరణ సంఘం ద్వారా ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. జూలై నుంచి కొత్త వేతన స్కేల్ అమలు చేయాల్సి ఉంది. పీఆర్సీ వేతనాలతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాల పైన ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ఈ నేపథ్యంలో సంబంధింత ఫైల్ ను సర్క్యులేట్ చేయాలని ఆర్దిక శాఖ ప్రధాన కార్యదర్శికి సీఎంవో సర్క్యులర్ పంపింది.
ఇన్నాళ్లూ మంత్రుల కమిటీలు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించేవి. కానీ అవి ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాలేదు. దీంతో తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చర్చలు జరిపారు. వచ్చే కేబినెట్ లో సమస్యల పైన చర్చిస్తామని.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి..నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నెల7న అత్యవసర కేబినెట్ మీటింగ్ ఉండడంతో దీనిపై చర్చించే అవకాశం ఉంది. ఇటు ప్రభుత్వం ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ అన్ని వర్గాలకు ప్రయోజనకరం చేకూర్చే నిర్ణయాల పైన ఫోకస్ చేసింది. ఇక, పీఆర్సీ సమయం కూడా దగ్గర పడటంతో ఆ దిశగా ఇప్పుడు కసరత్తు ప్రారంభించింది. సీపీఎస్ రద్దు విషయంలో ఏదో ఒక పరిష్కార మార్గం చూపున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల ఏడాది కావటంతో ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. టీడీపీ తాజాగా మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టోలో ఉద్యోగుల అంశాన్ని ప్రస్తావించ లేదు. ఇప్పుడ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు కీలకం కానుంది. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే అధికారికంగా సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కానుంది. ఆ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.