ఎంపీగా పోటీ చేయకుంటే ఇద్దరిలో ఒకరిని ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని..నిర్ణయం తీసుకోవాలని..ఒకరికే సీటు సాధ్యమని చెప్పినట్లు సమాచారం.కడప జిల్లాలో లోకేష్ యాత్ర పూర్తి కానుంది.
Anam : వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తరువాత కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ భవిష్యత్ కోసం పావులు కదుపుతున్నారు. ఆయనకు టీడీపీ నుంచి మార్గం సుగమం అయినట్టు తెలుస్తోంది. త్వరలో టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. శనివారం అనుచరులు, తమ వర్గం నేతలతో చర్చించి నిర్ణయం ప్రకటించడానికి ఆనం సిద్ధపడుతున్నారు.
ఆనం రామనారాయణరెడ్డి గత ఎన్నికల్లో వెంకటగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. మంత్రి పదవిని ఆశించారు. కానీ దక్కలేదు. మలివిడత విస్తరణలోనూ కనీస పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ నిర్ణయాలు, జగన్ వ్యవహార శైలిపై ఆనం బాహటంగానే వ్యాఖ్యానించేవారు. ఇది నాయకత్వానికి నచ్చలేదు. ఎమ్మెల్యేగా ఆనం ఉండగా.. పార్టీ ఇన్ చార్జ్ గా నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నెల్లూరు నుంచి ముగ్గురు, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పటికే ఆనం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయటం ఖాయమైంది.
అయితే ఎన్నికలు సమీపించడంతో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి పట్టు నిలుపుకునేందుకు ఆనం రామనారాయణరెడ్డి పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా చంద్రబాబుతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య గంటకుపైగా చర్చలు జరిగాయి. నెల్లూరు జిల్లా రాజకీయ సమీకరణలు గురించి మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆనంను వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు లేదా నెల్లూరు సిటీ నుంచి పోటీకి దింపాలనేది చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. గతంలో ఆత్మకూరు నుంచి ఆనం ప్రాతినిధ్యం వహించారు.నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణ పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నా..ఆనం పేరు పరిశీలనలోకి వచ్చింది.
ఆనం కుమార్తె కూడా ఈ సారి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆత్మకూరు సీటు ఆశిస్తున్నారు. ఆనం లేదా ఆయన కుమార్తె ఇద్దరికీ సీటు కావాలంటే ఒకరు ఎంపీగా..మరొకరు ఎమ్మెల్యేగా ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేయకుంటే ఇద్దరిలో ఒకరిని ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని..నిర్ణయం తీసుకోవాలని..ఒకరికే సీటు సాధ్యమని చెప్పినట్లు సమాచారం.కడప జిల్లాలో లోకేష్ యాత్ర పూర్తి కానుంది. నెల్లూరు జిల్లాలో లోకేష్ యాత్ర వేళ ఘనంగా ఏర్పాట్లు దిశగా ఆనం సిద్దమవుతున్నారు. ఈ రోజు అనుచరులతో జరిగే భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.