పోషకాలు అధికంగా ఉండే పన్నీర్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?పనీర్ భారతీయుల వంటకాలో ఒక రుచికరమైన వంటకం. మటర్ పన్నీర్, పనీర్ దో ప్యాజా, బటర్ పనీర్, పనీర్ పరోటా, పనీర్ టిక్కా, కడైన పనీర్ ఇలా మీరు ఎన్నో రకాల పనీర్ వంటకాలను రుచి చూసే ఉంటారు.పనీర్ భారతీయుల వంటకాలో ఒక రుచికరమైన వంటకం. మటర్ పన్నీర్, పనీర్ దో ప్యాజా, బటర్ పనీర్, పనీర్ పరోటా, పనీర్ టిక్కా, కడైన పనీర్ ఇలా మీరు ఎన్నో రకాల పనీర్ వంటకాలను రుచి చూసే ఉంటారు. పనీర్ ప్రోటీన్, విటమిన్లు ఖనిజాల అద్భుతమైన మూలం. పనీర్ వినియోగం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పనీర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
- ప్రోటీన్ మంచి మూలం:
ముఖ్యంగా శాఖాహారులకు పనీర్ ప్రోటీన్ కు మంచి మూలం. ఇది శరీరం సరైన పనితీరుకు అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇతర చీజ్‌లతో పోలిస్తే ఇది ఆరోగ్యకరమైన ఎంపిక. మీరు క్రమం తప్పకుండా పనీర్ ఆహారంలో చేర్చుకోవచ్చు.
- బరువు తగ్గడానికి:
పనీర్ అనేది తక్కువ కార్బ్, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం. ఇది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది. పనీర్ తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది.
- కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది:
పనీర్ శాకాహారులకు ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం. పనీర్ కండరాల పెరుగుదల, మరమ్మత్తు కోసం అవసరమైన అధిక-నాణ్యత ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది. ఇది బాడీబిల్డర్లు, అథ్లెట్లకు ఇష్టపడే ఆహారం.
- రక్తంలో చక్కెరను కంట్రోల్లో ఉంచుతుంది:
పనీర్ నిత్యం తీసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. పనీర్ లో ట్రిప్లోపాన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉండటంతో ఇది రక్తంలోని చక్కర పెరగటాన్ని నివారిస్తుంది. మీ రక్తంలో చక్కెరను మెరుగ్గా నిర్వహించడానికి, మీరు వైద్యునితో మాట్లాడి మీ ఆహారంలో పనీర్ ను చేర్చుకోండి.
- ఎముకలు, దంతాలకు మంచిది:
ఎముకలు, దంతాల ఆరోగ్యానికి పనీర్ ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు, దంతాల పెరుగుదల నిర్వహణకు అవసరమైన పోషకాలన్నీ కూడా పనీర్ లోఉన్నాయి. పనీర్ తోపాటుగా కాల్షియం ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను కూడా చేర్చుకోండి.
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
పనీర్ లో ఇమ్యూనిటీ లెవల్స్ పెంచేందుకు సహాయపడే జింక్ అధిక స్థాయిలో ఉంటుంది. తరచుగా ఆహారంలో చేర్చుకున్నట్లయితే జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు పనీర్ లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటడంతో మీరు అనారోగ్యం బారిన పడకుండా శక్తిస్థాయిలను పెంచడంతో కీలకంగా పనిచేస్తుంది.
- మెదడు ఆరోగ్యానికి మంచిది:
పనీర్ విటమిన్ B12 యొక్క గొప్ప మూలం. విటమిన్ B12 మంచి మెదడు ఆరోగ్యానికి అవసరమని నిరూపించబడింది. ఇది నాడీ వ్యవస్థ సరైన పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. అభిజ్ఞా రుగ్మతల ప్రమాదాన్ని నివారిస్తుంది. శాకాహారులలో విటమిన్ బి 12 లోపం సర్వసాధారణం, ఇది శాకాహారుల రోజువారీ ఆహారంలో పనీర్ చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
- ఒత్తిడి ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది:
పనీర్ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది న్యూరో ట్రాన్స్మిటర్, సెరోటోనిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది.
పనీర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే రుచికరమైన, పోషకాలు కలిగిన ఆహారం. ఇది పనీర్ టిక్కా, పనీర్ భుర్జీ, పనీర్ పరాఠాతోపాటు మరిన్ని రూపాల్లో తినవచ్చు. అయినప్పటికీ, పనీర్‌ను మితంగా తీసుకోవడం మంచిది.