Hyderabad:హైదరాబాద్‌లో పలు మెడికల్ దుకాణాల లైసెన్సులు రద్దు.. నిషేదిత డ్రగ్‌ను అమ్ముతున్న షాప్స్పై చర్యలు..
Hyderabad News:హైదరాబాద్ నగరంలో మెడికల్ దుకాణాలపై డ్రగ్ కంట్రోల్ విభాగం దాడులు నిర్వహించింది. పలు మెడికల్‌షాపుల్లో అధికారులు తనిఖీలు చేశారు. అధిక ధరలు, నాణ్యత లేని మందుల అమ్మకాలను గుర్తించిన అధికారులు.. ఆయా షాపులపై చర్యలు తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న పలు మెడికల్ దుకాణాల లైసెన్స్‌లను శాశ్వతంగా, మరికొన్నింటికి తాత్కాలికంగా రద్దు చేశారు. అందులో ఇవి కొన్ని
హైదరాబాద్, జూన్ 08: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ బోర్డ్ అధికారులు కలిసి మెడికల్ షాపులపై సోదాలు నిర్వహించారు..ఈ సోదాల్లో నిషేధిత ఆల్ఫజోలాం డ్రగ్‌ను విక్రయిస్తూ పట్టుపడ్డారు..ప్రసుత్తం అలా పట్టుబడిన మెడికల్ షాపులపై చర్యలకు దిగారు అధికారులు..వారి అనుమతులను రద్దు చేశారు.. హైదరాబాద్‌లోని కోఠి ఇందర్ బాగ్‌లోని గణేష్ ఫా ర్మాస్యూటికల్స్, అంబర్ పేటలోని బయోస్పియర్ ఎంటర్ప్రైజెస్ అంబర్పేట్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేశారు.అలాగే, నాంపల్లిలో సర్దార్ మెడికల్ హాల్ 3 రోజులు సస్పెండ్ చేయగా..అక్షయ మెడికల్, జనరల్ స్టోర్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేశారు..అటు నాంపల్లిలోని హైదరాబాద్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ వారం రోజుల పాటు అమ్మకాలు నిలిపివేశారు.
లంగర్ హౌస్ ఆర్ఎస్ వైద్య సాధారణ దుకాణాలు రద్దు కాగా, చార్మినార్ లోని భారత్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ మూడు రోజుల సస్పెన్షన్ వేటు వేసింది. హుమాయున్ నగర్ లో అల్హమ్రా మెడికల్ అండ్ జనరల్ స్టోర్ 15రోజులు అమ్మకాలు నిలిపిశారు..గౌలిగూడలోని గోకుల్ మెడికల్ షాప్ రెండు రోజులు, చార్మినార్ లోని మీరా మెడికల్ షాప్‌ను వారం మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది స్టేట్ డ్రగ్ కంట్రోల్ .
ఉప్పల్ శ్రీ అయ్యప్ప మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, గౌలిగూడ గోకుల్ మెడికల్ షాప్, చార్మినార్ మీరా మెడికల్ షాప్, మంగర్బస్తీ లైఫ్ ఫార్మా.. ఇలా పలు మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ చర్యలు తీసుకుంది. వీటిలో కొన్నింటి లైసెన్స్‌లను తాత్కాలికంగా, మరికొన్నింటిని లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేసింది.